హైదరాబాద్ జూన్ 30 (నమస్తే తెలంగాణ): సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ (ఎన్పీఏ)గా సీనియర్ ఐపీఎస్ అధికా రి ఏఎస్ రాజన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాజన్ బీహార్ క్యాడర్ అధికారి. ప్రస్తుత ఎన్పీఏ డైరెక్టర్ అతుల్ కర్వాల్ ఎన్డీఆర్ఎఫ్ డీజీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. కర్వాల్ స్థానంలో ఏఎస్ రాజన్ ఎన్పీఏ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.