హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సమాజంలోని దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) పని చేస్తున్నదని పలువురు ప్రజా, సాంస్కృతిక, హక్కుల సంఘాల నేతలు కొనియాడారు. ఏసీఎఫ్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్ఫూర్తి స భ నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య పార్ నుంచి వీఎస్టీ హాల్ వరకు కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాములు జెండాను ఆవిష్కరించారు. సాంసృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక అధ్యక్షతన జరిగిన స్పూర్తి సభలో ఆడియో, వీడియో పాటను ఆవిషరించారు. అరుణోదయ సాంసృతిక సమా ఖ్య ముద్రించిన 50 ఏండ్ల అరుణోదయ సావనీర్‌ను ఎనిశెట్టి శంకర్ ఆవిషరించారు. సమావేశంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న అరుణోదయ తన ఆశయసాధనలో మరింత శక్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సాంసృతిక రంగంలో అరుణోదయ కళాకారులు విశేష కృషి చేశారని జన సాహితీ అధ్యక్షుడు దివికుమార్ అభినందించారు. పాట ప్రజలు, కష్టజీవులదని మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్‌కుమార్ తెలిపారు. 50 ఏండ్లుగా ప్రజల పక్షాన అరుణోదయ పోరాటం చేసిందని ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావు కొనియాడారు. సమావేశంలో ప్రొఫెసర్ కాశీం, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూర్యం తదితరులున్నారు.