హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా ఏకాంతంగా జరిపిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు టీటీడీ ఏర్పా ట్లు చేస్తున్నది.
ఈ నెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కో యిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.