వేములవాడ టౌన్ ;సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్.. వేములవాడ రాజరాజేశ్వరిదేవి కోసం అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా, చీరను నేసి మంగళవారం ఆలయ ఈవో వినోద్‌రెడ్డికి అందజేశారు. వారి వెంట ఈవో సీసీ ఎడ్ల శివసాయి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అద్దాల మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు.