ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే పండుగ బతుకమ్మ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఏఆర్ రెహమాన్ తెలిపారు.