మే 1 వరకు దరఖాస్తు గడువు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాటికి 27 వేలకుపైగా వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి మించి దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో ఎడ్‌సెట్ పరీక్షాకేంద్రాల్లోని తొమ్మిది ప ట్టణాలను అధికారులు బ్లాక్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, కర్నూల్, హైదరాబాద్ వెస్ట్, మ హబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టణాలను పరీక్షాకేంద్రాలుగా ఎంపిక చేసుకోకుండా నిలిపివేశారు.
ఫలితంగా ఈ ప్రాంతాల అభ్యర్థులు వేరే పట్టణాలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉన్నది. ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును మే 1 వరకు పొడిగించినట్టు కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. ఎడ్‌సెట్ పరీక్ష మే 18న మూడు సెషన్లల్లో జరుగనున్నదని చెప్పారు. ఉదయం 9 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.