హైదరాబాద్, అక్టోబర్30 (నమస్తే తెలంగాణ): లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 7లోపు దరఖాస్తు చేసుకోవాలని డిపార్ట్మెంట్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలిపారు. ఇందుకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, దిల్సుఖ్నగర్లోని నవీన్ వివేకానందా కాలేజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, జడ్చర్లలోని జ్ఞానసాయి లైబ్రరీ సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఐదు నెలల పాటు కోర్సు నిర్వహిస్తామని వివరించారు.