 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మద్యం పాలసీపై అధ్యయనానికి ఏపీ ఎక్సైజ్ శాఖ బృందం గురువారం రాష్ట్రంలో పర్యటించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాన్ని పరిశీలించిన అధికారులు రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఆరా తీశారు. ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావడానికి తెలంగాణతో పాటు హర్యానా, యూపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో అధ్యయనం చేస్తున్నట్టు ఏపీ అధికారులు తెలిపారు.
 
                            