సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
యాదాద్రి, నవంబర్ 7 : యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతమని, ఆలయాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత కొనియాడారు. కార్తిక సోమవారం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘శ్రీరాములయ్య’ సినిమా విడుదల సమయంలో లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నానని, తిరిగి ఇప్పుడు మరోసారి వచ్చినట్టు చెప్పారు. ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.