హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో ఆదేశించింది. జీతాలు సరైన సమయానికి ఇచ్చేలా చట్టం చేయడంతోపాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్(రోసా) నిబంధనలకు విరుద్ధమని ప్రభు త్వం తెలిపింది. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు వివరించింది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలున్నా గవర్నర్ను ఎందుకు కలిశారని ప్రభుత్వం ప్రశ్నించింది.