హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. ధర్మరక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని మండిపడ్డారు. రంగరాజన్‌పై దాడిపై హిందూ ధర్మ పరిరక్షకులు ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని విమర్శించారు. దాడి ఘటనపై వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, హోమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ధర్మరక్షకులు దాడులు చేస్తారు…
రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు 👏🏼Chilkur temple chief priest and a great scholar Shri Rangarajan garu was attacked two days ago by fringe elements.
Not a word from the protectors of Hinduism on this act of cowardice
There are videos of the…
— KTR (@KTRBRS) February 10, 2025
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై గత శుక్రవారం దాడి జరిగింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ పవన్‌కుమార్ వెల్లడించారు.