హైదరాబాద్ : తెలంగాణ రైతులకి 24 గంటల ఉచిత కరెంటు దండగని రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఎఫ్దీసీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ కూడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టి వారి అభివృధ్ధికి కృషి చేస్తుంటే, మరోపక్క రైతుల పట్ల ఇంత ద్వేషంతో రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత హేయమైన చర్యని అ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ విధానమే రైతు వ్యతిరేకమని మరొక్కసారి రుజువైందని, మరి ఇలాంటి నాయకులు ఊర్లోకొస్తే నిలదీసి గట్టిగా బుద్ది చెప్పాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నాయత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి రైతుల కోసం ఉచిత కరెంట్ , రైతు బంధు, రైతు బీమా, ఏదైనా విపత్తు వస్తే ఆర్థిక సహాయం ఇలా రైతుల కోసం అహర్నిశలు పని చేస్తుందని గుర్తు చేశారు.
కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న అన్ని పథకాల్నిమనమంతా గుర్తు చేసుకోవాలన్నారు. రైతులంతా విజ్ఞతతో అలోచించి ఇలాంటి నాయకుడిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని రైతులని కోరారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.