మరో మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.

హైదరాబాద్ : తెలంగాణ సహా, చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు.
భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ బండ ప్రకాశ్, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, వరంగల్ సీపీ, ఆయా జిల్లాల ఎస్పీలు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదన్నారు.
అదే విధంగా గత సంవత్సరం వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిన దృష్ట్యా ప్రత్యేకంగా ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్ రావు కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు అధికారులు తాము ముందస్తుగా తీసుకుంటున్న చర్యలను మంత్రి కి వివరించారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

