హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ (ఐడీటీఆర్) ఏర్పాటుకు అవకాశాలు లేవని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రవాణాశాఖలోని పలు అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిన లేఖపై స్పందించిన నితిన్గడ్కరీ.. సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. 2.5 కోట్ల జనాభాకు ఒక ఐడీటీఆర్కి మాత్రమే అర్హత ఉంటుందని, ఇప్పటికే కరీంనగర్లో ఐడీటీఆర్ పనిచేస్తున్నదని గడ్కరీ స్పష్టం చేశారు. 3 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(ఆర్డీటీసీఎస్), ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (డీటీఎస్) కోసం రాష్ట్రం అర్హ త సాధించిందని తెలిపారు. వీటి ఏ ర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపొచ్చని పేర్కొన్నారు.