తొర్రూరు, అక్టోబర్ 30: సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లికి చెంది న పందుల వెంకటేశ్వర్లు(55)తన 3 ఎకరాల భూమిలో వరి, పత్తి సాగు చేశాడు. ఈ ఏడాది దిగుబడి ఆశించినంత రాలేదు. మరోవైపు 4 బోర్లు వేసి నా చుక్క నీరు పడలేదు. ఇంకోవైపు గొర్రెలకు వ్యాధి సోకి చనిపోవడంతో రూ. 9.60 లక్షలు అప్పు అయ్యింది. వీటిని తీర్చలేక మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించా డు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
10న గ్రూప్-3 హాల్టికెట్లు విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రూప్-3 పరీక్షల హాల్టికెట్లను నవంబర్ 10న విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. అదే రోజు నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్టికెట్లు, ప్రశ్నపత్రాలను భద్రపరుచుకోవాలని కమిషన్ సూచించింది. డూప్లికేట్ హాల్టికెట్లు జారీ చేయబోమని తెలిపింది. గ్రూప్-3 పరీక్షలను నవంబర్ 17, 18న నిర్వహించనున్నారు. 5.36లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.