హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో బయటపడ్డ కిడ్నీ అక్రమ మార్పిడుల కేసు దర్యాప్తును రాచకొండ పోలీసులు ముమ్మరం చేశారు. కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను అరెస్టు చేయగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించిన డాక్టర్ రాజశేఖర్‌ను అరెస్టు చేశామని సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. విశాఖపట్నంకు చెందిన రాజశేఖర్ తమిళనాడు, బెంగళూర్‌లో ఉంటూ కిడ్నీ మాఫియా దళారులతో సంప్రదింపులు సాగించేవాడు. హైదరాబాద్‌కు వచ్చి కిడ్నీ మార్పిడి చేసి వెళ్లిపోయేవాడు. ఎక్కువగా చెన్నై, బెంగళూర్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది.