Harihara krishna | నందిపేటలో మరో హరిహర కృష్ణ.. ప్రియురాలిని ప్రేమిస్తున్నాడని స్నేహితుడిని చంపేశాడు!
హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన నవీన్‌ను హత్య తరహాలోనే మరో దారుణంగా జరిగింది. తన ప్రియురాలు తనకు దక్కదనే అనుమానంతో నవీన్‌ను హరిహరకృష్ణ చంపిన కేసు తరహాలోనే మరొకటి వెలుగుచూసింది. తన ప్రియురాలిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడో ప్రియుడు.
- 6 నెలల క్రితం ఘటన.. వెలుగులోకి
నందిపేట్, మార్చి 1: హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన నవీన్‌ను హత్య తరహాలోనే మరో దారుణంగా జరిగింది. తన ప్రియురాలు తనకు దక్కదనే అనుమానంతో నవీన్‌ను హరిహరకృష్ణ చంపిన కేసు తరహాలోనే మరొకటి వెలుగుచూసింది. తన ప్రియురాలిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడో ప్రియుడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రానగర్‌లో ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్యోదంతం బుధవారం వెలుగు చూసింది.
ఆం ధ్రానగర్ జీపీ పరిధిలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన సౌతూరి కార్తీక్ (21) కూలీ. గత సెప్టెంబర్ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అదే గ్రామానికి చెందిన బాపట్ల రాజు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అదే అమ్మాయి ని కార్తీక్ కూడా ప్రేమిస్తున్నాడనే అనుమానంతో అతనిపై పగ పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని పథ కం వేశాడు. తన తమ్ముడు హరీశ్‌తో కలిసి కార్తీక్‌తో స్నేహం పెంచుకున్నాడు.
ఇద్దరు కలిసి నందిపేట్, విజయనగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కార్తీక్‌కు కల్లు తాగించారు. మత్తులోకి వెళ్లాక కార్తీక్‌ను విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని రాళ్లల్లో పడేసి, ఇంటికి వచ్చేశారు. ఈ విషయం ఇటీవల కార్తీక్ స్నేహితులకు తెలిసింది. వారు కార్తీక్ తల్లి వెంకటరమణకు తెలుపగా ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహం ఉన్న చోటును గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

