కాళేశ్వరం, జనవరి 20 : కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో కెమికల్ వేయడానికి గ్రౌటింగ్ ప్రిపరేషన్ పనులు కొనసాగుతున్నాయి. బరాజ్‌లో కొన్ని నెలల క్రితం ఏర్పడిన నీటి బుడగల గుంతలకు పూడ్చడం కోసం హిమాచల్‌ప్రదేశ్ నుంచి ప్రత్యేకమైన కెమికల్ తెప్పించి సీపేజ్‌లో మరమ్మతుల పనులు చేపడుఉతన్నారు. అక్కడి నుంచి వచ్చిన పాలీ యూరిత్రిన్ కెమికల్‌తో 3వ బ్లాక్‌లో దిగువ వైపు ఏర్పడిన గుంతను మూసివేశారు. మూసిన బుంగకు 15 రోజులపాటు పరిశీలనలో ఉంచి పరీక్షించనున్నారు. 4వ బ్లాక్‌లో ఏర్పడిన గుంతను పూడ్చడం కోసం మరికొంత కెమికల్ తెప్పిస్తున్నారు.