హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఏపీ ఐపీఎస్ క్యాడర్‌కు రిపోర్ట్ చేసిన తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌ను ఆ రాష్ట్ర జైళ్లశాఖ డీజీగా, అభిలాషబిస్త్ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. ఏపీ క్యాడర్‌కు రిపోర్ట్ చేసిన డీజీ అభిలాష బిస్త్ కొన్నాళ్లు చైల్డ్‌కేర్ లీవ్ కావాలని అభ్యర్థించగా, సీఎస్ విజయానంద్ అంగీకరించారు. దీంతో ఆమె లీవు ముగిసిన తర్వాత ఏపీ రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.