హైదరాబాద్, అక్టోబర్ 7: ఆల్ ఇండియా ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అనిల్ రెడ్డి వెన్నం నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో ఏడాదిపాటు కొనసాగనున్నారు. రూ.3.5 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమలో తొలిసారిగా తెలుగువారికి ఉన్నత పదవి వరించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఏఐపీఎంఏకి 175 నగరాల్లో 22 వేలకు పైగా సభ్యులు ఉన్నారని, వీరిలో 90 శాతం మంది ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవారేనని ఈ సందర్భంగా అనిల్ రెడ్డి తెలిపారు.