హైదరాబాద్: నిమ్స్ (NIMS) దవాఖానలో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నారు. నితిన్‌ను గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.