నయీంనగర్, అక్టోబర్ 17: కాళ్లు, చేతు లు, కండ్లు లేవని బాధపడుతున్నారా.. మీకు తోడుంటా.. మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుం టా.. అని ఓ వృద్ధుడు తన ఇంటి ఎదుట ఫ్లెక్సీ కట్టి ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
కమలాపూర్ మండలం భీంపెల్లికి చెందిన సముద్రాల ఐలయ్య 1986లో గ్రేట ర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటకు కూలి కోసం వచ్చాడు. ఇక్కడే స్థిరపడి అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు వృద్ధాప్యంలో కూతురు విజయలక్ష్మి, కుమారుడు రజినీకాంత్ సరిగా చూసుకోకపోవడంతో తమ డబ్బు పేదలకు చెందాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు చెప్పాడు.
తమ దగ్గరకు వచ్చిన వారి అడ్రస్ తీసుకొని వారికి ఏ సమస్య ఉన్నా, ఆస్తులు అమ్మి ఆదుకుంటామని ‘నమస్తే తెలంగాణ’కు తెలిపాడు. ఇప్పటికే రూ.25 లక్షలకు పైగా పంపిణీ చేశామన్నారు.