పెద్దవంగర, డిసెంబర్ 14 : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘ టన శనివారం రాత్రి మహబూబాబా ద్ జిల్లా పెద్దవంగర మండలంలో చో టుచేసుకున్నది. బాధితుడి కథనం ప్ర కారం.. పెద్దవంగర మండలం శంకర్‌తండాకు చెందిన బానోత్ అనూషకు కేసముద్రం మండలం చప్పిడి గుట్టతండాకు చెందిన రాజేశ్‌తో తొమ్మిదేండ్ల క్రితం పెండ్లి జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల తీర్మానం తో రాజేశ్ ఆస్తిని భార్యకు రాసి ఇచ్చా డు. అయినా అనూష కేసు పెట్టింది. కేసులో రాజేశ్‌ను ఎస్సై క్రాంతికిరణ్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయ గా రూ.15వేలు ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేయ గా, డబ్బులు లేవని రాజేశ్ చెప్పడంతో కోపంతో ఎస్సై, సిబ్బంది చితకబాదారు. ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.