ఖైరతాబాద్, సెప్టెంబర్ 26: ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో ఈ నెల 4న జరిగిన ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామాజిక, పౌర హక్కుల కార్యకర్తలు ఖలీదా పర్వీన్, సరా మాథ్యూస్, మసూద్, ప్రొఫెసర్ పద్మజాషాతో కలిసి మాట్లాడారు. జైనూరులో ఉద్దేశపూర్వకంగానే ఒక వర్గంపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని, దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.