దుండిగల్, జూన్ 21: యువతితో వీడియోకాల్ మాట్లాడుతూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే… మెదక్జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన జుమ్లావత్ రాజు తన భార్య, సోదరుడు శ్రీకాంత్ (22)తో కలిసి రెండేండ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ సాయిపూజకాలనీలో అద్దెకుంటున్నారు.
అన్నావదిన సొంత ఊరికి వెళ్లగా గురువారం రాత్రి శ్రీకాంత్ మరో ముగ్గురు బంధువులతో మద్యం తాగారు. ఈ క్రమంలోనే ఓ యువతి అతనికి ఫోన్చేసింది. మిగతా వారు బిర్యానీకి బయటికివెళ్లగా, శ్రీకాంత్ ఆ యువతితో వీడియోకాల్ మాట్లాడుతూ తాడు తో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.