IPS Trainee | పోలీస్ అకాడమీలో పోకిరీ.. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు
IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
IPS Trainee | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/బండ్లగూడ, జూలై 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి తీవ్రంగా బెదిరిస్తున్నాడని, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతోపాటు వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవల తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు చంపేందుకు ప్రయత్నించాడని, మెడపై కత్తి పెట్టి ఆ గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడని ఆ అధికారిణి ఆరోపించారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2) సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతను ఇన్స్పెక్టర్ బానోత్ రాజు నాయక్‌కు అప్పగించారు. చట్టాన్ని రక్షించాల్సిన ఐపీఎస్ అధికారి తన తోటి మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడటం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ ఈ వ్యవహారంపై జాతీయ పోలీస్ అకాడమీ వర్గాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

