భార్యతో వివాహేతర సంబంధం యువకుడి హత్య
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు ఓ యువకుడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల మండల కేంద్రానికి చెందిన చెప్పాల రాకేశ్ (26), తెడ్డు సూర్య మంచి స్నేహితులు.
మోర్తాడ్, జనవరి 1: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు ఓ యువకుడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల మండల కేంద్రానికి చెందిన చెప్పాల రాకేశ్ (26), తెడ్డు సూర్య మంచి స్నేహితులు. సూర్య జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లేవాడు. రాకేశ్ హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాకేశ్.. సూర్య భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న సూర్య.. మూడు నెలల క్రితం మోర్తాడ్‌కు వచ్చి రాకేశ్‌తో గొడవ పడ్డాడు. అప్పుడే రాకేశ్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న సూర్య.. సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల క్రిస్మస్ కోసం ఇంటికి వచ్చిన రాకేశ్.. సోమవారం తన ఇంటి సమీపంలోని వాటర్‌ట్యాంకు వద్ద ఉండగా.. సూర్య అదును చూసి కత్తితో పొడిచి చంపాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

