AMVI Hall Tickets | అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హాల్ టికెట్స్ రేపటి డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు tspsc.gov.in వెబ్సైట్ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ నెల 28న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష జరుగనున్నది. ప్రాక్టీస్ కోసం వెబ్సైట్లో మాక్టెస్ట్కు సంబంధించిన లింకు అందుబాటులో ఉందని, అభ్యర్థులు ప్రాక్టీస్ చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది.
గతేడాది డిసెంబర్ 31న టీఎస్పీఎస్సీ 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 113 పోస్టుల్లో 72 పురుషులు, 41 పోస్టులు మహిళలకు కేటాయించారు. వీటిలో మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు. ఆయా పోస్టులకు సంబంధించి జనవరిలో దరఖాస్తులు స్వీకరించారు. వాస్తవానికి ఏప్రిల్లో పరీక్ష జరుగాల్సి ఉండగా.. పేపర్ లీకేజీ వెలుగు చూడడంతో వాయిదా పడింది. ఈ క్రమంలో మళ్లీ జూన్ 28కి రీషెడ్యూల్ చేసింది.