హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గురుకులాల్లోని జేఎల్, పీడీ, లైబ్రేరియన్, పీజీటీ పోస్టుల దరఖాస్తులను బుధవారం నుంచి 19 వరకు సవరించుకోవచ్చని గురుకులాల కన్వీనర్ మల్లయ్యభట్టు తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్, పీడీ, డ్రాయిం గ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టుల దరఖాస్తులను 20 నుంచి 24 వరకు టీజీటీ దరఖాస్తులను 25 నుంచి 30 వరకు ఎడిట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.