జమ్మికుంట ఏఎంసీ చైర్మన్,వీణవంక సింగిల్‌విండో చైర్మన్

వీణవంక: తామంతా టీఆర్ఎస్లోనే కొనసాగుతామని, సీఎం కేసీఆర్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, వీణవంక సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్మా హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం వీణవంకలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన వారందరూ పార్టీలోకి రావాలని, ఇది వ్యక్తుల కోసం కాదని ఒక వ్యవస్థని, అభివృద్ధికి సంబంధించిన విషయమని తెలిపారు. ఆనాడు ఎంపీ వినోద్‌కుమార్, మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరామని, నేడు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని కోరే పార్టీలో కొనసాగుతామని స్పష్టంచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ పార్టీ ఇంచార్జిని నియమించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో ఆయ గ్రామాల సర్పంచ్‌లు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, మోరె సారయ్య, పొదిల జ్యోతి, అంగిడి రాధ, బండ సుజాత, మర్రి వరలక్ష్మి, ఎంపీటీసీలు రాధారపు రాంచందర్, పీఏసీఎస్ డైరెక్టర్లు రాములు, శ్యాంసుందర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, నాయకులు పొదిల రమేశ్, మర్రి స్వామి, గెల్లు మల్లయ్య, గెల్లు రమేశ్, కర్ణకంటి భాస్కర్‌రెడ్డి, తిరుపతి, రాజయ్య, శ్రీనివాస్, అడిగొప్పుల సత్యనారాయణ పాల్గొన్నారు. అంతకుముందు ఈ విలేకరుల సమావేశాన్ని ఈటల వర్గీయులు కొందరు అడ్డుకోడానికి ప్రయత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి, వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.