అల్మాస్ పూర్: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. శనివారం నాడు జిల్లా ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చిన్నారికి న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని చెప్పిన ఆయన.. బాధిత కుటుంబం అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ కళ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య, గిరిజన సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.