సినీ నటుడు అల్లు అర్జున్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జనవాడ శివారులో రెండు ఎకరాల ఐదు గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీన్ని శుక్రవారం శంకర్పల్లి తాసిల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ వెంటనే తాసిల్దార్ సైదులు రిజిస్ట్రేషన్ ప్రొసీడింగ్ పత్రాలను అల్లు అర్జున్‌కు అందజేశారు. – శంకర్పల్లి