హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. రెండు విడుతల్లో కలుపుకుని మొత్తంగా 75శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇక మూడు యూనివర్సిటీ కాలేజీలు, 12 ప్రైవేట్ కాలేజీల్లో వందశాతం సీట్లు నిండగా, ఒక ప్రైవేట్ కాలేజీలో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. కోర్సుల వారీగా.. సీఎస్ఈ, ఐటీ విభాగం కోర్సులకు విశేష స్పందన కనిపించింది. సీఎస్ఈలో 95.98శాతం, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో 77.87, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ డేటాసైన్స్‌లో 79.95, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్‌లో 88.92, సీఎస్ఈ ఐవోటీ అండ్ బ్లాక్‌చైన్ టెక్నాలజీలో 77.10 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా 24,002 సీట్లు మిగలగా వీటిని స్పెషల్ రౌండ్‌తో పాటు, స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీచేయనున్నారు. ఇక తుది విడుతలో సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 15లోగా ఫీజు చెల్లించడం, 16వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం, ఈ నెల 18లోపు సీట్లను రద్దుచేసునే అవకాశం కల్పించారు.