Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Nominated Posts | సిఫార్సు లేఖ అడిగిన వారిని ‘నీకు పదవి వస్తే.. నాకెంతిస్తావు’ అని పలువురు కీలక నేతలు అడుగుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Nominated Posts | హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘నీకు పదవి వస్తే.. నాకెంతిస్తావు’ ఇది కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల ఆశావహులకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఎదురవుతున్న మాట. దసరా పండుగ తర్వాత ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో పదవులు దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ఎగబడ్డారు.
ఈ సందర్భంగా వారికి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతున్నదని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సిఫార్సు లేఖ అడిగిన వారిని ‘నీకు పదవి వస్తే.. నాకెంతిస్తావు’ అని పలువురు కీలక నేతలు అడుగుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో భర్తీ చేస్తున్న మార్కెట్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులను పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారనే ప్రచారం గాంధీభవన్‌లో జోరందుకుంది.
ఎమ్మెల్యేలు తన పరిధిలోని అన్ని నామినేటెడ్ పోస్టులను స్థాయిని బట్టి రేట్ కట్టి.. అంగట్లో సరుకుగా మార్చేశారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు ప్రతి పోస్ట్‌కో రేటు పెట్టి.. ఎవరు డబ్బులిస్తే వారికే అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయా ఎమ్మెల్యేల తీరుపై హస్తం శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి, కష్టకాలంలో కూడా జెండా వీడకుండా ఉన్న వాళ్లను కాదని, తనకు కప్పంగట్టిన వాళ్లు, కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసహనం పెరిగిపోతున్నది.
ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌తో చేపడుతున్న పనుల ప్రొసీడింగ్స్‌కి 5 నుంచి 15 శాతం వరకు వాటా వసూలు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగాను చెప్పుకొంటున్నాయి. ఇటీవల పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టుల ఎంపికలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వసూలు చేశారనే ఫిర్యాదులు టీపీసీసీకి చేరాయి. సొసైటీ చైర్మన్ పోస్ట్‌కు రూ.5 లక్షల నుంచి రూ. 20 లక్షలు వరకు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ శ్రేణులే వాపోతున్నాయి.
రాష్ట్రస్థాయి పదవికి రూ.50 లక్షలు!
ఒకో కార్పొరేషన్ లేదా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లా స్థాయి పదవికి రూ.5 నుంచి రూ.10 లక్షలు అడుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అర్హులైన, పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, ఆర్థికంగా బలమున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. మొదటి విడత కార్పొరేషన్ పదవుల భర్తీ జరిగినప్పుడు, పార్టీని నమ్ముకుని ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న సీనియర్ నేతలను పకనబెట్టి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి లేదా కొత్తగా చేరిన వారికి పదవులు కట్టబెట్టారని పలువురు కాంగ్రెస్ సీనియర్లు బహిరంగంగానే తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఈ దఫా నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నిజమైన కార్యకర్తలు, సీనియర్ నేతలకే 60 శాతం వరకు పదవులు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పదేపదే పేర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకున్న వారికే ప్రాధాన్యం ఉంటుందని, పారదర్శకంగానే భర్తీ ప్రక్రియ జరుగుతుందని, ఎవరైనా సిఫార్సు లేఖలకు డబ్బులు తీసుకున్నట్టు తెలిస్తే.. ఇచ్చినవారిపై, తీసుకున్న వారిపై చర్యలు తప్పవని మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. అయినా పదవులు దక్కించుకునేందుకు అయినకాడికి ఇచ్చేందుకు ఎందరో ఆశావహులు ముందుకెళ్తున్నారని, పలువురు కీలక నేతలు అందినకాడికి నొక్కుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

