హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తె లంగాణ): ఇండియా కూటమి పార్టీలు చేపట్టిన ఆందోళనలో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన ని ర్వహించాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టరే ట్ కార్యాలయం ఎదుట 9 వామపక్ష పార్టీ ల నేతలతోపాటు కాంగ్రెస్, టీజేఎస్ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమి తి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హకును తొలగిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టును సైతం మోసం చేసిన గజదొంగ జ్ఞానేశ్‌కుమార్ అని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా కుట్రపూరిత ఆలోచనతోనే ఎ న్నికల చట్టాన్ని మార్చి ముందుగా మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. ఓటు చోరీ, సీట్ చోరీ, చందా చోరీ, నిషాన్ చోరీ , నేతా చోరీ చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్రమైన పోరాటాలకు సిద్ధం కావాలని అఖిలపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్ ఛాయాదేవి, జిల్లా కార్యదర్శి స్టాలిన్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు ఝౌన్సీ, మాస్‌లైన్ నాయకులు ప్రదీప్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సన్న, ఎంసీపీఐయు రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్, ఎస్‌యూసీఐసీ నాయకుడు భరత్, వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ పాల్గొన్నారు.