మైనారిటీ వెల్ఫేర్ల పర్యవేక్షణ గాలికి!
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్లను గాలికొదిలేసింది. దీంతో గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్లల్లో చదువుకునే వేలాదిమంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- సంక్షేమశాఖ లో పోస్టులు ఖాళీ
- 200కు పైగా హాస్టళ్ల నిర్వహణ ఆగం
- ఔట్సోర్సింగ్ వార్డెన్లతో హాస్టళ్లను నెట్టుకొస్తున్న ఉన్నతాధికారులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్లను గాలికొదిలేసింది. దీంతో గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్లల్లో చదువుకునే వేలాదిమంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలోని హాస్టళ్ల సంక్షేమశాఖ అధికారులు పోస్టులు 15కు 15 ఖాళీగా ఉండటంతో హాస్టళ్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200పైగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో చదువుకొనే 11వేల మంది విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఫలితంగా వారికి నాణ్యమైన ఆహారం, వసతి, భద్రత విషయంలో పర్యవేక్షణ లేకుండాపోయింది. ఈ విషయాన్ని సంబంధిత మంత్రితోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని మైనార్టీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువును మధ్యలోనే మానేస్తున్నారని వాపోతున్నారు.
ఇన్చార్జులుగా ఔట్సోర్సింగ్ వార్డెన్లు
ఉమ్మడి పది జిల్లాల్లోని 204 మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల పర్యవేక్షణకు 15మంది హాస్టల్ సంక్షేమశాఖ అధికారులను నియమించారు. అయితే ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయకుండా వారి స్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇన్చార్జి వార్డెన్లుగా నియమించారు. వీరికి రెండు, మూడు జిల్లాల హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇన్చార్జి వార్డెన్లను నియమించడంతో పర్యవేక్షణ కరువైందని మైనార్టీ సంఘాల నాయకులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులకు కనీస వసతులు లేవని, భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ వార్డెన్లు ఇచ్చే ఆదేశాలు, సూచనలను కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్డబ్లూవో గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

