Cristiano Ronaldo | ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో..!
Cristiano Ronaldo | పోర్చుగల్ (Portugal) దేశానికి చెందిన ఫుట్‌బాల్ స్టార్ (Football Star) క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. గత నెలలో నేషన్స్ లీగ్ మ్యాచ్ (Nations League Match) లో కోచ్ జార్జ్ జీసస్ (Jorge Jesus).. రొనాల్డోను ఆడించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
Cristiano Ronaldo : పోర్చుగల్ (Portugal) దేశానికి చెందిన ఫుట్‌బాల్ స్టార్ (Football Star) క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. గత నెలలో నేషన్స్ లీగ్ మ్యాచ్ (Nations League Match) లో కోచ్ జార్జ్ జీసస్ (Jorge Jesus).. రొనాల్డోను ఆడించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో ఈ స్టార్ ప్లేయర్ జట్టు నుంచి బయటకు వచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే అతడు రిటైర్మెంట్ ప్రకటన చేయడం గమనార్హం.
41 ఏళ్ల రొనాల్డో పోర్చుగల్ తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఘనత అతడిదే. వ్యక్తిగతంగా ఎంత సాధించినా తన జట్టును ప్రపంచకప్‌లో విజేతగా నిలిపి, ట్రోఫీని చేతిలోకి తీసుకుంటేనే ఏ ఆటగాడి కెరీర్ అయినా పరిపూర్ణం అవుతుంది. రొనాల్డోకు మాత్రం ఈ టైటిల్ అందని ద్రాక్షే అయింది. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినా కొన్నేళ్లు క్లబ్ ఆటగాడిగా అలరించనున్నాడు.
పోర్చుగీస్ ప్రజలారా మన జాతీయ జట్టుకు చెందిన 7వ నంబర్ జెర్సీని తిరిగి ఇచ్చే సమయం వచ్చేసిందని ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ జెర్సీ తన ఒక్కడిదే అని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. కానీ 23 సంవత్సరాలుగా ఆ జెర్సీని ధరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాలకు తనతోపాటు తీసుకువెళ్లే అదృష్టం, బాధ్యత తనకు దక్కిందని అన్నారు. ఇవాళ ఈ జెర్సీని భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
ఇది అంత సులభమైన నిర్ణయం కాదని, ఎందుకంటే కొన్ని నిర్ణయాలను కేవలం బుద్ధితో మాత్రమే తీసుకోలేమని, వాటి వెనుక హృదయ స్పందన కూడా ఉంటుందని రొనాల్డో పేర్కొన్నారు. 2003 ఆగస్టులో మొదలై తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన ఒక ప్రయాణం నేటితో ముగిసిందని రొనాల్డో తన వీడ్కోలు సందేశంలో తెలిపారు. రొనాల్డోను మూడు యూఈఎఫ్ఏ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు, 4 యూరోపియన్ గోల్డెన్ షూ పురస్కారాలు వరించాయి.
రొనాల్డో ఐదుసార్లు ఫిఫా అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. రొనాల్డో జట్టులోకి వచ్చిన తర్వాత ప్రపంచకప్‌లో పోర్చుగల్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కు వెళ్లడం. అది క్రిస్టియానో అరంగేట్రం చేసిన 2006 టోర్నీనే కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cristiano Ronaldo | ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో..!
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

