పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా పెన్షనర్లలో డిజిటల్ సాధికారత పెంపొందించేందుకు నిర్వహిస్తున్న 'డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5.0'లో భాగంగా గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా, రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం, బొగ్గు గనుల భవిష్యనిధి సంస్థ (సీఎంపీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ...
– సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ వెంకటరమణ
రుద్రంపూర్, నవంబర్ 05 : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా పెన్షనర్లలో డిజిటల్ సాధికారత పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5.0’లో భాగంగా గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా, రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం, బొగ్గు గనుల భవిష్యనిధి సంస్థ (సీఎంపీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎంపీఎఫ్ పెన్షనర్లు, సీపీఆర్ఎంఎస్ కార్డుదారులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ విధానంపై అవగాహన కల్పించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్-1 వంశీధర్ కుసుంబ, రీజినల్ కమిషనర్-2 ఎం. కనకమ్మ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీనివాస్, సులోచన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జీఎం వెంకటరమణ మాట్లాడుతూ గతంలో లైఫ్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్ కోసం మాజీ ఉద్యోగులు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ద్వారానే జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ సాంకేతిక సదుపాయాన్ని అభివృద్ధి చేసిన సీఎంపీఎఫ్ అధికారులకు, సంబంధిత బృందానికి సింగరేణి మాజీ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు అందించే సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ద్వారానే లైఫ్ సర్టిఫికెట్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలని జీఎం సూచించారు. పెన్షన్ అప్డేట్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. అలాంటి ఫోన్ కాల్స్‌ను నమ్మి బ్యాంకు ఖాతాల్లోని నగదును కోల్పోవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంబంధిత సీఎంపీఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అనంతరం సీఎంపీఎఫ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యాప్‌లో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే విధానాన్ని వివరించారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ అప్డేట్ చేసుకోని పెన్షనర్లకు సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు, సిబ్బంది వారి మొబైల్ ఫోన్ల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసేందుకు సహకరించారు. 200 మందికి పైగా సీఎంపీఎఫ్ పెన్షనర్లు, సీపీఆర్ఎంఎస్ కార్డుదారులు పాల్గొని తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను విజయవంతంగా అప్డేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ కే. రాములు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, ఎస్ఓ టు జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డీవైపీఎం జి. హరీష్, సీనియర్ పీఓ మజ్జి మురళి, కొత్తగూడెం ఏరియాలోని వివిధ గనుల సంక్షేమ అధికారులు, సంబంధిత సిబ్బంది, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, సీఎంపీఎఫ్ అధికారులు, సింగరేణి మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

