హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష (ఏఐఎస్ఎస్ఈఈ) వాయిదా పడింది. 2024 జనవరి 21న జరగాల్సిన ఈ పరీక్షను జనవరి 28కి వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
దరఖాస్తుల తప్పుల సవరణకు డిసెంబర్ 24 వరకు అవకాశం ఇచ్చినట్టు పేర్కొన్నది.