హైదరాబాద్, నవంబర్26 (నమస్తే తెలంగాణ): వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యం లో మంగళవారం నిర్వహించిన అలయ్ బల య్ కార్యక్రమంపై దివ్యాంగ సంఘాల నుం చి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమమా? అని మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీర య్య ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల సంఘాల నేతలతో అల య్ బలయ్ కార్యక్రమాన్ని మలక్‌పేట సంక్షేమభవన్‌లో ఏర్పాటు చేశారు. కార్యక్రమ పో స్టర్‌పై సీఎం, మంత్రులతోపాటు కాంగ్రెస్ నే తల ఫొటోలను కూడా ముద్రించడంపై రచ్చ జరుగుతున్నది. ఇదీ పార్టీ కార్యక్రమమా? ప్ర భుత్వ కార్యక్రమమా? అని దివ్యాంగ సం ఘాల నేతలు నిలదీస్తున్నారు. దీనిపై చైర్మన్‌తోపాటు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.