Airindia | హైదరాబాద్ : ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తతతో 103 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిరిండియా విమానం విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్కు బయల్దేరింది. అయితే మార్గమధ్యలో విమానం రెక్కల్లోకి పక్షి దూరింది. దీంతో ఆ పక్షి విమానం రెక్కల్లో ఇరుక్కుపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. తిరిగి విమానాన్ని విశాఖ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశాడు. సురక్షితంగా విమానం ల్యాండ్ కావడంతో ఎయిర్పోర్టు సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 103 మంది ప్రయాణికుల కోసం ఎయిరిండియా సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.