హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రధాన పట్టణాలకు నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే హైదరాబాద్ నుంచి రాజ్కోట్, అగర్తలా, జమ్ము మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజాగా శుక్రవారం మరికొన్ని ప్రధాన నగరాలకు సేవలు మొదలయ్యాయి. హైదరాబాద్ – కాన్పూర్, అయోధ్యకు మధ్య వారానికి నాలుగు రోజుల సర్వీసు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. శనివారం నుంచి హైదరాబాద్ – ప్రయాగరాజ్, ఆగ్రా ప్రధాన నగరాల మధ్య వారానికి మూడు రోజుల విమాన సర్వీసు సైతం అందుబాటులోకి రానున్నది. నూతన విమాన సర్వీసుల ప్రారంభంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.