Ahmedabad Plane Crash | హైదరాబాద్ : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు బలం చేకూరాలని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Deeply shocked by the tragic plane crash near Ahmedabad.
My heartfelt condolences to the families who lost their loved ones.
Praying for the swift recovery of the injured and strength to everyone affected by this devastating incident.
May the departed rest in peace.
— Harish Rao Thanneeru (@BRSHarish) June 12, 2025