శేరిలింగంపల్లి, మే 5 : గచ్చిబౌలిలోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఉర్దూ జర్నలిజంలో పరిశోధనలు బలోపేతం చేసేందుకు గురువారం ఐఐఎంసీ కార్యాలయంలో మనూ వీసీ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఐఐఎంసీ డైరక్టర్ జనరల్ సంజయ్ ద్వివేది ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రెండు సంస్థలు ఉమ్మడి డిగ్రీలను అందించే క్లస్టర్ వ్యవస్థ చర్యలను విస్తృతం చేయనున్నట్టు ఐనుల్ హసన్ చెప్పారు. కార్యక్రమంలో మనూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్కే ఇస్తియాక్ అహ్మద్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం స్కూల్ డీన్ ప్రొఫెసర్ ఎహేతేషామ్ అహ్మద్‌ఖాన్, అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ గోవింద్ సింగ్, ఐఐఎంసీ ప్రొఫెసర్ ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.