TSPSC | హైదరాబాద్ : రద్దు చేసిన ఏఈఈ( AEE ) నియామక పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ( TSPSC ) ప్రకటించింది. మే 8వ తేదీన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పోస్టులకు, 9న అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మే 21న సివిల్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ పోస్టులకు ఆన్లైన్లో, సివిల్ పోస్టులకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను చూడొచ్చు.