Dense Fog | ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. శంషాబాద్‌కు రావాల్సిన ఐదు విమానాలు దారి మళ్లింపు
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగ అలముకుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది.
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగ అలముకుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. తక్కువ దూరంలోని వాహనాలు కనిపించని పరిస్థితి. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగ మంచు (Dense Fog) ప్రభావం విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం శంషాబాద్ (Shamshabad)లో పొగమంచు కారణంగా పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు.
శంషాబాద్‌కు రావాల్సిన ఐదు విమానాలను (Five flights diverted) ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా (Adverse weather conditions) దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం శంషాబాద్‌లో ల్యాండ్ కావాల్సిన మూడు విమానాలను దారి మళ్లించారు. ఛత్తీస్‌గఢ్, గోవా, తిరువనంతపురం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఎయిర్‌లైన్స్‌కు చెందిన UK897 విమానాన్ని సైతం తిరిగి బెంగళూరు మళ్లించినట్లు చెప్పారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన UK873 (విస్తారా) విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి ముంబైకి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Dense Fog | దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
Coronavirus | 4 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు.. థానేలో 5 కొత్త జేఎన్.1 కేసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

