Bengaluru Traffic | మరోసారి స్తంభించిన సిలికాన్ వ్యాలీ.. 3 గంటల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
Bengaluru Traffic | బెంగళూరు (Bengaluru) మహానగరం మరోసారి స్తంభించింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా నగరంలోని రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. సెలవు దినానికి తోడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలు నగరంలోని ప్రముఖ ఫీనిక్స్ మాల్ (Phoenix Mall)కు పోటెత్తారు.
Bengaluru Traffic | బెంగళూరు (Bengaluru) మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది. సిలికాన్ వ్యాలీ (Silicon Valley)గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలో ట్రాఫిక్ (Bengaluru Traffic) ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇక సెలవుల సమయంలో చెప్పాల్సిన పనేలేదు. సొంతూళ్లకు వెళ్లే నగర వాసులు సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో మహానగరం మొత్తం ఎక్కిడకక్కడ స్తంభించిపోతుంటుంది.
తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా మరోసారి నగరం స్తంభించింది. ఆదివారం నగరంలోని రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. సెలవు దినానికి తోడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రజలు నగరంలోని ప్రముఖ ఫీనిక్స్ మాల్ (Phoenix Mall)కు పోటెత్తారు. దీంతో బళ్లారి సర్వీస్ రోడ్డులో భారీ ట్రాఫిక్ నెలకొంది. దాదాపు మూడు గంటల పాటు పలు ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విమానాశ్రయానికి వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు కూడా గంటల తరబడి ఆగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. సాధారణంగానే సెలవు దినం రోజు ఈ ఫీనిక్స్ మాల్‌కు ప్రజలు పోటెత్తుతుంటారు. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ కావడంతో మాల్ వద్ద 100 అడుగుల ఎత్తులో అతిపెద్ద క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీంతో ప్రజలు భారీ ఎత్తున అక్కడికి క్యూ కట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది.
గత బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గార్డెన్ సిటీగా మొన్నటివరకూ ముద్దుగా పిలుచుకొన్న బెంగళూరు నగరాన్ని నేడు సమస్యలకు కేరాఫ్‌గా పిలుస్తున్నారు. రోడ్డెక్కితే ట్రాఫిక్ కష్టాలు. నరకానికి చిరునామాగా బెంగళూరు మారిపోయిందంటూ ప్రముఖులు సైతం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Also Read..
Dense Fog | దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
Coronavirus | 4 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు.. థానేలో 5 కొత్త జేఎన్.1 కేసులు
Bihar | పొత్తిళ్లలో దాచుకొని పిల్లలను రైలు ప్రమాదం నుంచి కాపాడిన తల్లి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

