Coronavirus | 4 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు.. థానేలో 5 కొత్త జేఎన్.1 కేసులు
Coronavirus | భారత్‌లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు బయటపడ్డాయి.
Coronavirus | భారత్‌లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది.
ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 128 కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్క రోజే ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,33కి చేరింది. ఇక 24 గంటల్లో 315 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో తాజాగా 5 కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. నవంబర్ 30 నుంచి 20 నమూనాలను పరీక్షించగా థానే నగరంలో ఐదు JN.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో క్రియాశీల కేసుల సంఖ్య 28కి పెరిగింది. వారిలో ఇద్దరు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు వారి ఇళ్లలో కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ (New Covid Variant) జేఎన్.1 (JN.1) కారణమని తెలుస్తోంది.
Also Read..
Hijab | హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కర్ణాటక హోం మంత్రి
Crime News | మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు
Hardhik Pandya | వామ్మో.. పాండ్యాకు అంత ధరనా!.. ముంబై నిజంగానే 100 కోట్లు ఇచ్చిందా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

