Hijab | హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కర్ణాటక హోం మంత్రి
Hijab | హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర స్పష్టం చేశారు. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
Hijab | బెంగళూరు : హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర స్పష్టం చేశారు. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఒక సీఎం సిద్ధరామయ్య చేసి ఉంటే, వాటిని పరిశీలిస్తామన్నారు.
హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం పేర్కొన్నారు. శుక్రవారం మైసూర్ పర్యటన సందర్భంగా హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను మేం ఇంకా ఉపసంహరించుకోలేదు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి, ఆపై ఖరారు చేస్తామని తాను బదులిచ్చానని సిద్ధరామయ్య చెప్పారు.
మహిళలు తమకు నచ్చిన దుస్తులను ధరించొచ్చు. అది వారి హక్కు అని సీఎం శుక్రవారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదేపదే వ్యాఖ్యానించే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఉట్టి బోగస్ మాటలు అని ధ్వజమెత్తారు. దుస్తులు, కులాల ఆధారంగా ఈ దేశ ప్రజలను, సమాజాన్ని బీజేపీ విభజిస్తోందని మండిపడ్డ సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

