హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల సీట్ల భర్తీ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 25 నుంచి సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 25, 26న రిజిస్ట్రేషన్, 28న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 28, 29న వెబ్ ఆప్షన్స్, 30న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, సెప్టెంబర్ 1న సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్స్‌ను తిరిగి కొనసాగించాలని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు కోరారు. శుక్రవారం ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణఆదిత్యను కలిసి వినతిపత్రం సమర్పించారు.